Wednesday, July 9, 2014

ఆలుతో సూప్

Picture
కావలసిన పదార్థాలు :
ఆలు (పొట్టుతీసి, ముక్కలు కోసి)- మూడు,
పెద్ద ఉల్లిపాయ (తరిగి)- ఒకటి,
పచ్చిమిర్చి (నిలువుగా కోసి) - ఐదు,
అల్లం (సన్నగా తరిగి) - చిన్న ముక్క,
చిక్కటి కొబ్బరి పాలు - ఒక కప్పు,
పలుచటి కొబ్బరి పాలు - ఒక కప్పు,
నీళ్లు - సరిపడా,
కరివేపాకు రెబ్బలు - రెండు,
ఉప్పు - సరిపడా,
కొబ్బరి నూనె - ఒక టేబుల్ స్పూన్.

తయారుచేసే పద్ధతి :
  • పలుచటి కొబ్బరి పాలను కుక్కర్లో పోసి అందులో బంగాళాదుంప, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు వేయాలి. ఉప్పు వేసి, నీళ్లు పోసి స్టవ్ వెలిగించాలి. రెండు విజిల్స్ వచ్చే వరకు ఉంచి తరువాత మూత తెరిచి మంట తగ్గించి చిక్కటి కొబ్బరి పాలు పోయాలి. రెండు నిమిషాలు ఉడికిన తరువాత కొబ్బరి నూనె, కరివేపాకులు వేసి స్టవ్ ఆపేయాలి. కుక్కర్ మీద మూత కొన్ని నిమిషాల పాటు అలానే ఉంచితే నూనె, కరివేపాకుల సువాసనలు సూప్లోకి ఇంకి కమ్మటి వాసన వస్తుంది.
  • ఈ సూప్ను ఆపం లేదా ఇడియాపంతో తీసుకుంటారు. శాండ్విచ్ బ్రెడ్, చపాతి, పూరి, అన్నంతో పాటు తీసుకున్నా బాగానే ఉంటుంది. వేగించిన బ్రెడ్ క్రంబ్స్తో కూడా రుచిగా ఉంటుంది.
  • కారంగా కావాలనుకుంటే గరం మసాలా వేసుకోవచ్చు. క్యారెట్, పచ్చి బఠాణీ, కాలీఫ్లవర్, బీన్స్ వంటి కూరగాయలను వేసుకుంటే ఇదే మిక్స్డ్ వెజిటబుల్ సూప్ అవుతుంది.

No comments:

Post a Comment