
వెజిటబుల్స్ - నూడుల్స్ సూప్ కావలసినవి:
బీన్స్‌ముక్కలు - పావు కప్పు,
క్యారట్ ముక్కలు - పావు కప్పు,
నూడుల్స్ - అర కప్పు,
ఉల్లికాడల తరుగు- 4 టీ స్పూన్లు,
అజినమోటో - చిటికెడు,
ఉప్పు - తగినంత
నూనె - టీస్పూను,
మిరియాలపొడి - పావు టీస్పూను
చిల్లీసాస్ - టీ స్పూను,
సోయాసాస్ - పావు టీ స్పూను
కొత్తిమీర - కొద్దిగా
వెజిటబుల్స్ - నూడుల్స్ సూప్ తయారి:
బీన్స్, క్యారట్‌ముక్కలను ఆరు కప్పుల నీటిలో ఐదు నిముషాలు ఉడికించి, వడకట్టి నీరు తీసి పక్కన పెట్టుకోవాలి. తగినంత నీరు పోసి నూడుల్స్‌ను కూడా ఉడికించి నీరు వడకట్టి పక్కన పెట్టుకోవాలి. పాన్‌లో నూనె వేడి చేసి, ఉల్లికాడల తరుగు, ఉడికించిన కూరముక్కలు వేసి వేయించాక, కూరగాయలు ఉడికించిన నీళ్లు, అజినమోటో, మిరియాలపొడి, తగినంత ఉప్పు, సోయాసాస్, చిల్లీసాస్ వేసి మరిగించాలి. మరిగాక నూడుల్స్ కూడా వేసి కొద్దిసేపు ఉడికించాలి. కొద్దిగా చిక్కబడ్డాక ఉల్లికాడల తరుగు లేదా కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేయాలి.
No comments:
Post a Comment