Sunday, July 6, 2014

పండు మిరప పచ్చడి


కావలసినవి :
250 గ్రా., పెద్దసైజు పండు మిరపకాయలు
80 గ్రా., అల్లం,50 గ్రా.,వెల్లుల్లి
150 మి.లీ ఆవనూనె
ఉప్పు తగినంత
పచ్చడికి కావాల్సిన పొడి :
1 టీస్పూను ఆవాలు
1 టేబుల్‌ స్పూను ధనియాలు
ఒక చిన్న ముక్క ఇంగువ
1 టీస్పూను సోంపు(ఇష్టమైతే)
1 టీస్పూను జీలకర్ర
3/4 టీస్పూన్లు మెంతులు
తయారుచేసే విధానం :
మిరపకాయలు కడిగి ఒక మిరపకాయలో నాలుగు గుండ్రని ముక్కల్లాగా  గింజతో సహా కట్‌చేసుకోవాలి. మిరపకాయలకు ఉప్పు పట్టించి తడంతా ఎండిపోయేదాకా అంటే 2-3 గంటలు ఎండలో పెట్టాలి. పొడిచేసుకోడానికి మసాలాలను ఎండలో పెట్టి మెత్తగా పొడిచేసుకోవాలి. అల్లం, వెల్లుల్లి పొట్టు తీసివేసి గ్రైండ్‌ చేసు కోవాలి. ఆవనూనె వేడిచేసి చల్లార్చాలి. ఈ నూనె మిరపకాయలు, అల్లం వెల్లుల్లి ముద్ద, మసాలా పొడులు, ఉప్పు మొత్తం బాగా కలుపుకుని ఒక సీసాలోకి తీసుకోవాలి. ఎండ పడేలాగా ఈ సీసాలను 3-4 రోజులు ఉంచి తరువాత వాడుకోవచ్చు.

No comments:

Post a Comment