Wednesday, July 9, 2014

వెజిటబుల్ పాస్టా సూప్

చలికాలంలో ఎక్కువగా వేడి ఆహారమే తీసుకోవాలి. అందునా మసాలాలు, నూనె , కొవ్వు తక్కువగా ఉండి పుష్టికరమైనవిగా ఉండాలి.  చలికి సూప్ లు చాలా మంచివి. వేడిని, శక్తిని ఇస్తాయి. ఇవాళ ఒక కొత్తరకం సూప్ చేసుకుందాం. పిల్లలకు చాలా నచ్చుతుంది ఎందుకంటే వాళ్లకిష్టమైన  పాస్టా వేస్తాం కదా..

ఉడికించిన పాస్టా – 1 కప్పు
క్యారట్ – 1
బీన్స్ – 8
ఉల్లిపాయ – 1
క్యాప్సికం – 4 tbsp
ఉప్పు – తగినంత
మిరియాల పొడి – 1/4 tsp
వెన్న – 1 tbsp

వెన్న వేడి చేసి చిన్నగా కట్ చేసుకున్న కూరగాయలను పచ్చి వాసన పోయేవరకు వేపాలి. ఇందులో 4 కప్పులు నీళ్లు , పాస్టా, ఉప్పు, మిరియాల పొడి వేసి ఐదు నిమిషాలు మరిగించి దింపి సన్నగా తరిగిన ఉల్లిపొరక లేదా కొత్తిమిర వేసి సర్వ్ చేయాలి.

No comments:

Post a Comment