Thursday, July 10, 2014

రాజ్‌మా (రెడ్ బీన్) సలాడ్


కావలసిన పదార్థాలు :
రాజ్‌మా (రెడ్ బీన్)... ఒక కప్పు
వెల్లుల్లి... నాలుగు రెబ్బలు
నూనె... ఒకటిన్నర టీ.
టొమోటో... వంద గ్రా.
క్యాబేజీ... వంద గ్రా.
పచ్చిమిర్చి... రెండు
ఉల్లిపాయలు... 50 గ్రా.
ఉప్పు... తగినంత
నిమ్మరసం... ఒక టీ.

తయారీ విధానం :
రాజ్‌మాను మూడు గంటలపాటు నానబెట్టి, కుక్కర్‌లో ఉడికించాలి. టొమోటోలను నాలుగు ముక్కలుగా కోయాలి. క్యాబేజీ, ఉల్లిపాయలను కూడా ఒకటిన్నర అంగుళాల సైజులో ముక్కలుగా కోసి, పక్కన పెట్టాలి. 

ఓ బాణలిలో నూనె పోసి వెల్లుల్లి ముక్కలు వేసి ఎర్రగా వేయించాలి. తరువాత ఉల్లి, టమోటో, క్యాబేజీ ముక్కలను కూడా వేసి బాగా కలియబెట్టి వేయించాలి. ఇవి ఉడికిన తరువాత, రాజ్‌మాను కూడా కలిపి వేయించాలి. సరిపడా ఉప్పు, నిమ్మరసం కలిపి వేడి వేడిగా వడ్డించాలి. అంతే రాజ్‌మా (రెడ్ బీన్) సలాడ్ తయారైనట్లే..! మీరూ ట్రై చేస్తారు కదూ...!?

No comments:

Post a Comment