Wednesday, July 9, 2014

బేబీకార్న్‌ మంచురియా


ఇవి కావాలి:
Baby
బేబీకార్న్‌   : ఐదు
మొక్కజొన్న పిండి  : అర కప్పు
బియ్యం పిండి  : పావు కప్పు
కారం   : కాస్తంత
అల్లంవెల్లుల్లి ముద్ద  : ఒక టీ.
ఉప్పు   : తగినంత
నూనె   : సరిపడా
ఉల్లిపొరక తరుగు  : ఒక కట్ట
ఉల్లిపాయ          : ఒకటి
వెల్లుల్లి తరుగు  : ఒక టీ.
టొమోటో సాస్‌  : ఒక టీ.


ఇలా చేయాలి:
బేబీకార్‌‌నను ఒకే సైజులో తరిగి ఉప్పు నీటిలో ఉడికించాలి. ఇప్పుడు మొక్కజొన్న, బియ్యంపిండి, కారం, అల్లంవెల్లుల్లి ముద్ద, కొద్దిగా ఉప్పు వేసి మరో పాత్రలో బజ్జీలపిండిలా కలపాలి. ఇందులో ఉడికించిన బేబీకార్‌‌నను ముంచి బాగా మరుగుతున్న నూనెలో వేసి బజ్జీల మాదిరి వేయించి తీసి ఉంచాలి.వేరే బాణలిలో కాస్త నూనె వేడిచేసి అందులో వెల్లులి తరుగు, ఉల్లిపాయ, ఉల్లిపొరక ముక్కల్ని వేసి ఎరగ్రా వేయించాలి. ఇందులో వేయించి పెట్టుకున్న బేబీకార్‌‌న ముక్కల్ని ఒక్కోటి చొప్పున ఉంచాలి. పెైన సోయా, చిల్లీసాస్‌, టమాటా సాస్‌, ఇంకాస్త ఉప్పు చల్లితే వేడివేడి బేబీకార్‌‌న మంచూరియా రెడీ. సంబంధిత సమాచారం కోసం శోధించండి.

No comments:

Post a Comment