Sunday, July 6, 2014

టమోటా పచ్చడి 2


కావలసినవి :
500 గ్రాముల టమోటా
110 మి.లీ నువ్వుల నూనె
1/2 టీస్పూను దాల్చిన చెక్కపొడి, 1 టేబుల్‌ స్పూను కారం
ఉప్పు తగినంత
తయారుచేసే విధానం :
టమోటాలను రెండు ముక్కలుగా కట్‌చేసుకోవాలి. జల్లెడలో వేసి లోపల గుజ్జు నుంచి గింజను తీసివేయాలి. ముక్కల్ని ఒక కప్పు నీటితో ప్రెషర్‌ కుక్కర్‌లో ఉడికించాలి. ముక్కల్ని చల్చార్చి మిక్సీలో వేసి గ్రైండ్‌ చెయ్యాలి. ఈ గుజ్జును జ్యూస్‌ ఫిల్టర్‌లో వేసి వడకట్టాలి. అడుగు మందంగా ఉన్న గిన్నెలోకి ఈ గుజ్జును తీసుకుని తిరిగి ఉడికించాలి. తక్కువ మంటపై ఉడికిస్తూ ఇందులో ఉప్పు, దాల్చిన చెక్క పొడి, కారం చేర్చాలి. ఈ గుజ్జు సగానికి తరిగి బాగా చిక్కబడే వరకూ స్టౌమీద ఉంచాలి. చివరిగా నువ్వులనూనె వేసి బాగా కలపాలి. ఇప్పుడు స్టౌమీద నుంచి దించి ఈ పచ్చడి చల్లారిన తరువాత ఎయిర్‌టైట్‌ కంటెయినర్‌లో నిలువ చేసుకోవాలి. ఇది చపాతీలకు, కట్‌లెట్స్‌, వడలకు లేదా అన్నంలోకైనా రుచిగా ఉంటుంది. వెల్లుల్లిని ఇష్టపడేవారు దీన్లో     కొన్ని వెల్లుల్లి రేకలు దంచి వేసుకోవచ్చు. అలాగే దాల్చిన చెక్క పొడికి బదులుగా మెంతులు, జీలకర్ర వేయించి పొడిచేసి ఒక స్పూను కలుపుకోవచ్చు.

No comments:

Post a Comment