Friday, July 4, 2014

టమోటా - పల్లీ నూరు పచ్చడి

Picture  Recipe

కావలసిన పదార్థాలు

  • మూడు టమోటాలు - ముక్కలు చేసి
  • చిన్న ముక్క చింతపండు
  • అర కప్పు వేరుశెనగ పలుకులు (పల్లీలు)
  • రెండు పచ్చి మిరపకాయలు
  • ఒక ఎండు మిరపకాయ
  • ఒక చెంచాడు జీలకర్ర
  • చిటికెడు ఇంగువ
  • చిటికెడు బెల్లం
  • రుచికి సరిపడ ఉప్పు
  • ఒక చెంచాడు నూనె

తయారీ విధానం

ముందుగా బాణెలిని స్టవ్వు మీద పెట్టుకొని, అందులో నూనె వెయ్యకుండా పల్లీలు వేయించుకోవాలి. పల్లీలు కాల్లర్చుకొని, పొట్టు తీసేసుకోవాలి.
తర్వాత బాణెలిలో చెంచాడు నూనె వేసుకోవాలి.
దీనిలో జీలకర్ర వేసి, కొంచం వేగిన తర్వాత, పచ్చిమిరపకాయలు, ఎండు మిరపకాయ, చిటికెడు ఇంగువ వేయాలి. మిరపకాయలు వేగిన తర్వాత నూనెతో మొత్తం ఒక గిన్నెలోకి తీసుకొని, బాణెలి మళ్ళా స్టవ్వు మీద పెట్టుకోవాలి.
ఇప్పుడు బాణెలిలో టమోటా ముక్కలు వేసి, నీరు పోయేంతవరకు మగ్గించుకోవాలి. స్టవ్వు ఆపేసి, దీనికి చింతపండు కలిపి పెట్టి చల్లార్చుకోవాలి.
ఇప్పుడు పల్లీలను, వేయించుకున్న పోపు దినుసులను మొత్తం మిక్సీలో తిప్పుకోవాలి, దీనికి టమోటాను, ఉప్పు, చింతపండు కలిపి, కొంచెం నీరు చిలకరించుకొని ముద్దగా రుబ్బుకోవాలి.
గిన్నెలోకి తీసుకొని సన్నగా తరుగుకున్న కొత్తిమీర చల్లుకోవాలి.
ఈ పచ్చడి ఇడ్లీలలోకి, అట్లులోకి ఎంతో బాగుంటుంది.

No comments:

Post a Comment