Tuesday, July 8, 2014

సర్వపిండి

Picture
కావలసినవి: 
బియ్యప్పిండి - 3 కప్పులు;
నువ్వుపప్పు, పల్లీలు, ఉల్లికాడల తరుగు - పావు కప్పు చొప్పున;
ఉల్లితరుగు - అర కప్పు;
వెల్లుల్లి తరుగు - టీ స్పూను;
కొత్తిమీర తరుగు - 2 టేబుల్‌స్పూన్లు;
కరివేపాకు తరుగు - టేబుల్ స్పూను;
పచ్చిమిర్చి తరుగు - టీ స్పూను;
ఉప్పు - తగినంత;
కారం - కొద్దిగా;
నూనె - డీప్ ఫ్రైకి సరిపడా;
పుట్నాలపప్పు, నానబెట్టిన శనగపప్పు, క్యారట్ తురుము - పావు కప్పు చొప్పున;
ధనియాలు, అల్లం రసం - టీ స్పూను చొప్పున.

తయారి: 
  • నువ్వుపప్పు, పల్లీలను విడివిడిగా సుమారు గంటసేపు నానబెట్టాలి. ఉల్లితరుగును మిక్సీ పట్టాలి (మరీ మెత్తగా అవ్వకూడదు) ఒక పెద్ద పాత్రలో బియ్యప్పిండి, నానబెట్టి వడకట్టిన నువ్వుపప్పు, పల్లీలు, ఉప్పు, పచ్చిమిర్చితరుగు, కారం, వెల్లుల్లితరుగు, ఉల్లికాడల తరుగు, కరివేపాకు తరుగు, కొత్తిమీర తరుగు, ఉల్లితరుగు, పుట్నాలపప్పు, నానబెట్టిన శనగపప్పు, క్యారట్ తురుము వేసి బాగా కలపాలి.
  • కొద్దిగా నీరు జత చేసి పిండి గట్టిగా ఉండేలా కలపాలి.
  • పిండిని చిన్న ఉండలా చేతిలోకి తీసుకుని, నూనె రాసిన ప్లాస్టిక్ కవర్ మీద చేతి వేళ్లతో పల్చగా అద్దాలి.
  • ఇలా మొత్తం పిండినంతా తయారుచేసుకుని పక్కన ఉంచుకోవాలి. బాణలిలో నూనె వేడయ్యాక, ఒత్తి ఉంచుకున్నవాటిని ఒకటొకటిగా వేస్తూ బాగా వేగిన తరువాత తీసేయాలి.

No comments:

Post a Comment