Friday, July 4, 2014

పచ్చిమిర్చి పచ్చడి

Picture  Recipe

కావలసిన పదార్థాలు

  • పచ్చిమిర్చి 200 గ్రా.
  • నిమ్మరసం 50 మి.లీ.
  • కారం 1 టీస్పూ//
  • మెంతులు 1/2 టీస్పూ//.
  • ఆవాలు 1/2 టీ.
  • పసుపు 1 టీస్పూ//.
  • వేయించిన జీలకర్రపొడి 2 టీస్పూ//.
  • ఉప్పు తగినంత
  • నూనె 3 టీస్పూ//.

తయారీ విధానం

మెంతులు, ఆవాలు పొడి చేసి అందులో కారం, పసుపు, జీలకర్రపొడి, ఉప్పు వేసి కలపాలి.
సన్నగా, పొడుగ్గా తరిగిన పచ్చిమిర్చి ముక్కల్ని గింజలు తీసివేసి.. నిమ్మరసంలో గంటసేపు నానబెట్టాలి.
కాచిన నూనెలో పైన చెప్పుకున్న పొడుల మిశ్రమాన్ని వేసి అందులో పచ్చిమిర్చి ముక్కల్ని కూడా వేసి బాగా కలియబెట్టాలి.
పచ్చిమిర్చి చట్నీ తయారవుతుంది.
దీనిని గాజు జాడీలో పెట్టి 5 రోజులు ఊరిన తరువాత తింటే చాలా రుచిగా ఉంటుంది.

No comments:

Post a Comment