Tuesday, September 2, 2014

బూడిద గుమ్మడి కాయ ఒడియాలు

DSCN2833
గుమ్మడి వడియాలు

వీటిని గుమ్మడి వడియాలంటారు. కలగలుపు పప్పు లోకి, పచ్చిపులుసు వడియాలు కలుపుకుని పచ్చిపులుసు చేసుకుంటే బాగుంటాయి. బూడిద గుమ్మడితో చేస్తారు, బూడిద గుమ్మడిని కూష్మాండం అంటారు, ఈ కూష్మాండ లేహ్యం జ్ఞాపక శక్తిని పెంచుతుంది.మరి వడియాలు కూడా అంతేగా. పళ్ళు లేని నా లాటివారికి ఇబ్బందే, నమలడం.

కావలసిన పదార్థాలు

  • బూడిద గుమ్మడి కాయ - 1
  • పచ్చిమిరపకాయలు - 200గ్రా
  • జీలకర్ర - 50గ్రా
  • ఉప్పు - తగినంత
  • మినపపప్పు- 1కేజి.

తయారీ విధానం

1.ముందురోజు గుమ్మడికాయను చిన్న ముక్కలుగా కోసుకోవాలి.(ముక్కలుగా నచ్చకపోతే తురుముకోవచ్చు)
2. తరిగిన ముక్కలను పలుచని కాటన్ చీరలో వేసి గట్టిగా మూట గట్టి, ఒక పెద్ద పాత్రలో ఉంచాలి.
3. ఆ మూటపై ఏదైనా బరువును ఉంచి రాత్రంతా ఉంచాలి.
3A. ఇలాచేయడం వలన ముక్కలనుంచి నీరంతా బయట పాత్రలో పడుతుంది.
4. మినపప్పును నీటిలో నాన పెట్టుకోవాలి..
5. మరునాడు ఉదయం గుమ్మడి ముక్కలను మూటనుంచి తియ్యాలి.
6. నానపెట్టిన మినపప్పును తగినంత ఉప్పు వేసి మెత్తగా గారెపప్పులా రుబ్బు కోవాలి.(రుబ్బేటప్పుడు ఆ ముక్కలనుంచి వచ్చిన నీటిని వాడితే ఒడియాలు మరింత రుచిగా ఉంటాయి.)
7. పచ్చిమిరపకాయలను, జీలకర్రను మిక్సీ వేసి ఆ గుజ్జును మినపపిండిలో కలపాలి.
8. పలుచని చీరమీద కాని ప్లాస్టిక్ కాగితం మీదగానీ గుమ్మడికాయ ముక్కలను పిండిలో కలుపుకుంటూ చిన్నవి గా పెట్టుకొని రెండురోజులు ఎండలో ఉంచాలి.

No comments:

Post a Comment