Friday, July 4, 2014

నేతి దోసకాయ ముక్కల పచ్చడి


Picture  Recipe

కావలసిన పదార్థాలు

  • దోసకాయ ముక్కలు.. 1 కప్పు
  • నూనె.. 1 టీస్పూ//
  • శనగపప్పు. 2 టీస్పూ//
  • జీలకర్ర. 1 టీస్పూ//
  • ఆవాలు. 1 టీస్పూ//
  • పచ్చిమిర్చి. 5
  • టొమోటో. 1
  • చింతపండు గుజ్జు. 2 టీస్పూ//
  • ఉప్పు. తగినంత
  • వెల్లుల్లి రేకలు. 4
  • నెయ్యి. తగినంత

తయారీ విధానం

బాణెలిలో నెయ్యి వేడయ్యాక శనగపప్పు, జీలకర్ర, వెల్లుల్లి, పచ్చిమిర్చి వేసి వేయించాలి.
టొమోటాలను జతచేసి కాసేపు ఉడికించిన తరువాత చింతపండు గుజ్జు, ఉప్పు కలపాలి.
ఈ మిశ్రమం చల్లారిన తరువాత మెత్తగా నూరుకోవాలి.
దాంట్లో దోసకాయ ముక్కల్ని కలపాలి.
మరో పాత్రలో ఒక టీస్పూన్ నూనె వేసి వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, కరివేపాకు వేయించి ఈ పోపును దోసకాయ చట్నీలో కలుపుకోవాలి

No comments:

Post a Comment