Friday, July 4, 2014

బీరకాయ పొట్టు పచ్చడి

Picture  Recipe

కావలసిన పదార్థాలు

  • బీరకాయ పొట్టు. 2 కప్పులు
  • మెంతులు. కాసిన్ని
  • కరివేపాకు. ¼ కప్పు
  • కొత్తిమీర. 1/4 కప్పు
  • వెల్లుల్లి. 10 రెబ్బలు
  • ఉప్పు. తగినంత
  • చింతపండు. నిమ్మకాయంత
  • ఎండుమిరపకాయలు. 5
  • జీలకర్ర. 1/2 టీస్పూ//
  • ధనియాలు. 1 టీస్పూ//
  • నెయ్యి.. సరిపడా

తయారీ విధానం

ముందుగా బీరకాయ పొట్టును బాగా పిండి కాస్త పొడిగా ఉండేలా చూడాలి.
స్టవ్‌పై బాణెలి పెట్టి అందులో రెండు టీస్పూన్ల నెయ్యి వేసి ఈ బీరకాయ పొట్టును వేయించి వేరే పాత్రలోకి తీసుకోవాలి.
అదే బాణలిలోనే మరికాస్త నెయ్యి వేసి జీలకర్ర, మెంతులు, ఎండుమిరపకాయలు, ధనియాలు, వెల్లుల్లి, కరివేపాకు, కొత్తిమీరలను వేసి బాగా వేయించాలి.
తరువాత వీటన్నింటినీ తగినంత ఉప్పువేసి రోట్లో మెత్తగా నూరాలి.
ఆపై వేయించి పెట్టుకున్న బీరకాయ పొట్టును వేసి నున్నగా నూరాలి.
ఇది వేడి వేడి అన్నం, దోశెలు, ఇడ్లీల్లోకి చాలా రుచిగా ఉంటుంది. ముఖ్యంగా బీరకాయ పై పొట్టులో విటమిన్ "ఎ" చాలా పుష్కళంగా లభిస్తుంది.

No comments:

Post a Comment