Friday, July 4, 2014

ఉల్లిపుదీనా పచ్చడి

Picture  Recipe

కావలసిన పదార్థాలు

  • పుదీనా.. 2 కట్టలు
  • జీలకర్ర.. 2 టీస్పూ//
  • ఎండుమిర్చి.. 4
  • చింతపండు. 2
  • నిమ్మకాయలంత టొమోటోలు. 2
  • ఉల్లిపాయలు. 5
  • ఉప్పు. తగినంత
  • నూనె. 2 టీస్పూ//
  • పోపు
  • ఆవాలు.. 1/2 టీస్పూ//
  • జీలకర్ర. 1/2టీస్పూ//
  • ఎండుమిర్చి. 1
  • కరివేపాకు. 1 రెబ్బ

తయారీ విధానం

ఓ బాణెలి లో నూనె వేసి జీలకర్ర, ఎండుమిర్చి వేసి వేయించాలి.
అందులోనే చింతపండు, టొమాటో ముక్కలు వేసి దగ్గరగా ఉడికించాలి.
విడిగా మరో బాణెలి లో పుదీనా వేసి వేయించాలి. ఉల్లిపాయల్ని ముక్కలుగా కోయాలి.
ఇప్పుడు మిక్సీలో వేయించిన జీలకర్ర, ఎండుమిర్చి, చింతపండు, టొమాటో ముక్కలు, ఉప్పు వేసి మెత్తగా రుబ్బాలి.
పుదీనా, ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి మళ్లీ గ్రైండ్‌ చేయాలి.
ఇప్పుడు దీన్ని సరిపడా నూనెతో పోపు పెడితే ఉల్లిపుదీనా పచ్చడి తయార్.

No comments:

Post a Comment