Friday, July 4, 2014

కాకర పచ్చడి


కావలసిన పదార్థాలు

  • కాకరకాయలు. 2
  • పచ్చిమిర్చి. 6
  • ఎండుమిర్చి. 2
  • బెల్లం తురుము. 4 టీస్పూ//.
  • అల్లం తురుము. 1 టీస్పూ//.
  • ఆవాలు. 1 టీస్పూ//.
  • కరివేపాకు. 1 రెమ్మ
  • చింతపండు. నిమ్మకాయంత
  • పసుపు. చిటికెడు
  • ఉప్పు, నూనె. తగినంత

తయారీ విధానం

చింతపండును గోరువెచ్చటి నీటిలో నానబెట్టాలి. లోపలి గింజలను తీసివేసి, కాకరకాయలను ముక్కలుగా కోయాలి.
నూనె వేడిచేసి, కాకరకాయ ముక్కలను వేయాలి. కాస్తంత రంగు మారిన తరువాత అల్లం తురుము, పసుపు వేసి కలపాలి. బాగా వేగిన తరువాత దించేసి చల్లారబెట్టాలి.
మళ్లీ కాస్త నూనె వేడిచేసి.ఆవాలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు వేయాలి.
వేగిన తరువాత చింతపండుగుజ్జు, బెల్లం తురుము వేసి ఐదు నిమిషాలు వేయించి, అందులో ఉప్పు, కాకరకాయ ముక్కలను కూడా కలపాలి.
మిశ్రమం చిక్కగా అయ్యేంతదాకా అలాగే ఉడికించి దించేయాలి. అంతే కాకరకాయ పచ్చడి రెడీ అయినట్లే.

No comments:

Post a Comment