Friday, July 4, 2014

కాలిఫ్లవర్ కారట్ పచ్చడి

Picture  Recipe

కావలసిన పదార్థాలు

  • తోలు వలిచిన కేరట్స్... ౩
  • మెత్తటి బెల్లం. 1/2 కప్పు
  • పసుపు... 1 టీస్పూన్
  • ఉప్పు తగినంత
  • కాలిఫ్లవర్. 1
  • వెనిగర్.1/4 టీస్పూ//
  • కారం..సరిపడా

తయారీ విధానం

కేరట్లను సన్నటి ముక్కలుగా కట్ చేసుకోవాలి. కాలిఫ్లవర్‌ను సన్నగా తరగాలి. కారం, కేరట్, కాలిఫ్లవర్‌, పసుపు తీసుకుని బాగా కలుపుకోవాలి.
వీటిని ఓ గిన్నెలో వేసి ఎండలో నాలుగు రోజులపాటు ఉంచాలి. వెనిగర్ గోరువెచ్చగా చేసి, దాంట్లో బెల్లం వేసి బాగా కలపాలి.
బెల్లం కరిగేదాకా వెనిగర్‌ను వేడిచేసి, చల్లారిన తరువాత ఎండబెట్టి ఉంచుకున్న కేరట్, కాలిఫ్లవర్ మిశ్రమాన్ని కలపాలి.
దీన్ని మరో గిన్నెలోకి తీసుకుని ఐదు రోజులపాటు ఉంచిన తరువాత తింటే చాలా రుచిగా ఉంటుంది. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది

No comments:

Post a Comment