Friday, July 4, 2014

కాకర పచ్చడి 2

Picture  Recipe

కావలసిన పదార్థాలు

  • కాకరకాయలు. 1/4 కేజీ
  • చింతపండు. కాస్తంత
  • ఉప్పు. తగినంత
  • ఎండుమిర్చి. 4
  • ధనియాలు. 2 టీస్పూ//
  • మినప్పప్పు. 1 టీస్పూ//
  • పచ్చిశెనగపప్పు. 1 టీస్పూ//
  • ఇంగువ. చిటికెడు
  • పోపుకోసం ఆవాలు, జీలకర్ర, దంచిన వెల్లుల్లి రెబ్బలు,కరివేపాకు.. తగినంత

తయారీ విధానం

కాకరకాయలను చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి.
ఒక గిన్నెలోకి చింతపండు తీసుకుని ఉడికించి, గుజ్జులా చేసుకుని దాంట్లో కాకరకాయ ముక్కలు, ఉప్పు, పసుపు వేసి కాసేపు ఉడికించాలి.
దించిన తరువాత నీటిని వంపేసి, ముక్కల్ని బాగా పిండేయాలి. బాణెలి లో నూనె కాగిన తరువాత కాకర ముక్కల్ని వేసి వేయించాలి.
మరో చిన్న బాణెలి లో కాస్త నూనె వేసి ఎండుమిర్చి, ధనియాలు, మినప్పప్పు, పచ్చి శెనగపప్పు వరుసగా వేసి, అవి దోరగా వేగిన తరువాత కొంచెం ఇంగువ వేసి వేయించాలి.
దించి చల్లారిన తరువాత వీటిని మిక్సీలో వేసి మెత్తగా నూరాలి.
ఆ తరువాత కాకరముక్కలు, ఉప్పు, చింతపండు గుజ్జుల్ని కూడా వేసి మెత్తగా రుబ్బాలి.
ఆ తర్వాత పోపుకోసం తీసుకున్న పదార్థాలతో పోపుపెట్టి పచ్చడిలో కలపాలి. అంతే చేదు తక్కువగా, రుచి ఎక్కువగా ఉండే కాకర పచ్చడి తయార్.

No comments:

Post a Comment