Friday, July 4, 2014

మిక్స్‌డ్ వెజిటబుల్ పచ్చడి

Picture  Recipe

కావలసిన పదార్థాలు

  • వంకాయలు. 4
  • టొమోటోలు 4
  • ఉల్లిపాయలు 4
  • పచ్చిమిర్చి 2 -10
  • కొబ్బరితురుము 1 కప్పు
  • చింతపండు నిమ్మకాయంత
  • ఉప్పు. తగినంత
  • నూనె. 6 టీస్పూ//

పోపు కోసం

  • ఎండుమిర్చి 10
  • ఆవాలు 1 టీస్పూ//
  • జీలకర్ర, 1టీస్పూ//
  • శనగపప్పు, 1టీస్పూ//
  • మినప్పప్పు 1టీస్పూ//
  • ఇంగువ, చిటికెడు
  • పసుపు.. చిటికెడు

తయారీ విధానం

ముందుగా పోపు దినుసులన్నింటినీ కాస్తం నూనె వేడి వేయించి ఒక గిన్నెలోకి తీసి పక్కనుంచాలి.
ఆ తరువాత కూరగాయల ముక్కల్ని అదే బాణెలిలో మిగిలిన నూనె వేసి మెత్తబడేంతదాకా వేయించాలి.
ముందుగా పోపు దినుసులను గ్రైండ్ చేసి, ఆ తరువాత కూరగాయ ముక్కల్ని కూడా వేసి మొత్తాన్ని మెత్తగా గ్రైండ్ చేసి ఉప్పు సరిచూసుకోవాలి.
ఇది అన్నంలోకి, దోశెల్లోకి చాలా రుచిగా ఉంటుంది.

No comments:

Post a Comment