Tuesday, September 2, 2014

మామిడికాయ తొక్కు పచ్చడి

కావలసిన పదార్థాలు

మామిడికాయ - 1 cup తురిమినది
ఎండు మిరపకాయలు - 20
ఆవాలు - 2 tablespoons
మెంతులు - 1 tablespoon
ఇంగువ - చిటికెడు
నూనె
పోపు కొరకు

ఆవాలు - 1 tablespoon
పచ్చి శెనగపప్పు - 1 tablespoon
జీల కర్ర - 1 teaspoon

తయారు చేసే విధానము

1  ముందుగ మామిడికాయ ముక్కలను తురిమి పక్కన పెట్టుకోవాలి.

2  ఎండు మిరపకాయలను దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి.
ఆవాలు, మెంతులను కూడా వేయించుకోవాలి.
ఎక్కువ వేగకుండా జాగర్త  పడాలి. ఎక్కువ వేగితే పచ్చడి చేదు వస్తుంది.
ఇంగువ వేసుకొని అన్నిటిని కలిపి పొడి చేసి పక్కన పెట్టుకోవాలి.

3  చేసుకొన్నా పొడిని, ఉప్పు ని మామిడికాయ తురుముతో కలుపుకోవాలి.
రోట్లో అయిన దంచుకోవచు లేదా grinder లో వేసి ఒకసారి తిప్పి కలపచ్చు

4 ఒక బాండలి లో నాలుగు గరిటెల నూనె పోసి కాగ పెట్టుకోవాలి.
నూనె వేడి చేసాక అందులో పోపు దినుసులు వేసి వేయించుకోవాలి.
ఈ నూనె ని చేసుకొన్నా మామిడికాయ తురుములో కలుపుకోవాలి.
బాగా కలుపుకోవాలి. నూనె పైకి తేలాలి. ఎందుకంటే పచ్చడి నూనె ని మొత్తం పీల్చు కుంటుంది.

అంతే మామిడికాయ తొక్కు పచ్చడి రెడీ. వేడి వేడి అన్నం తో తింటే ఎంతో బావుంటుంది.

No comments:

Post a Comment